KTR: మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తాను.. లేదంటే..!: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఎప్పుడూ మందు పోయలేదు.. పైసలు పంచలేదన్న కేటీఆర్
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు చెక్కుల పంపిణీ
  • కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను చెప్పి విపక్షాలను నిలదీయాలని సూచన
KTR interesting comments on Rajanna Sircilla

మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తాను... ఓట్ల కోసం మాత్రం మందు పోయనని, పైసలు పంచనని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలోను ఇలా చేయలేదన్నారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం... ఎలాగైనా మీకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటానన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 600 మంది బీసీ బంధు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను చెప్పి వారిని నిలదీయాలన్నారు.

ప్రతిపక్షాలు తమకు సలహాలు ఇస్తేనే పెన్షన్ పెంచలేదన్నారు. ఇప్పుడు ఆరువందల మందికి పెన్షన్ ఇస్తే వార్త కాదని, కానీ ఆరుగురికి రాకుంటే వార్త అవుతోందన్నారు. తెలంగాణలో 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చామన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా తొమ్మిది రకాల పథకాలను అమల్లోకి తెచ్చామన్నారు. బీసీ బంధు అంటే లోన్ కాదని, ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ అనీ అన్నారు. దీనిని తిరిగి కట్టవలసిన అవసరం లేదన్నారు.

More Telugu News