Raghu Rama Krishna Raju: వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చిరంజీవి బాగా మాట్లాడారు: రఘురామకృష్ణ రాజు

Chiranjeevi well spoken about AP Govt says Raghu Rama Krishna Raju
  • రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలంటూ ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి సూచన
  • సినిమా మీద ఎందుకు పడుతున్నారని ప్రశ్న
  • వివేకా హత్య కేసులో జగన్ ను సీబీఐ పిలిచే ఉంటుందన్న రఘురాజు
 ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలంటూ ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా మీద ఎందుకు పడుతున్నారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందిస్తూ... ప్రభుత్వం గురించి చిరంజీవి చాలా చక్కగా, బుద్ధి వచ్చేలా మాట్లాడారని అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు సీఎం జగన్ ను సీబీఐ పిలిచే ఉంటుందని... అయితే ఆయన బిజీగా ఉండటం వల్ల వెళ్లి ఉండకపోవచ్చని చెప్పారు. మూడు నెలలు సమయం అడిగి ఉండొచ్చని అన్నారు. వివేకా హత్య కేసులో నిజమైన దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నానని చెప్పారు. తాను ఒకటి చెపితే సీబీఐ మరొకటి రాసిందని అజేయ కల్లం అనవసరంగా పిటిషన్ వేశారని అన్నారు.  

Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
Chiranjeevi
Tollywood

More Telugu News