OnePlus Open: వన్ ప్లస్ తొలి ఫోల్డబుల్ ఫోన్.. మతి పోగొట్టే డిజైన్!

  • ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ లో విడుదలకు అవకాశం
  • దీని ధర రూ.1.20 లక్షల స్థాయిలో ఉంటుందన్న అంచనా
  • వన్ ప్లస్ నుంచి వస్తున్న ఖరీదైన ఫోన్ ఇదే
OnePlus Open foldable smartphone India price leaked ahead of official launch

వన్ ప్లస్ కు మన దేశంలో యూజర్లు ఎక్కువ. ఈ సంస్థ నుంచి మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్ ప్లస్ ఓపెన్’ విడుదల కాబోతోంది. ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ లో విడుదల కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల గురించి ముందుగా సమాచారాన్ని బయట పెట్టే యోగేష్ బ్రార్ వన్ ప్లస్ ఓపెన్ ధర వివరాలను వెల్లడించారు. 

ఆయన చెబుతున్న దాని ప్రకారం వన్ ప్లస్ ఓపెన్ ధర సుమారు రూ.1.2 లక్షలుగా ఉండొచ్చు. ఇదే నిజమైతే వన్ ప్లస్ నుంచి అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది. వామ్మో అంత రేటా? అనుకుంటున్నారా..? శామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ.1,54,999తో పోలిస్తే తక్కువే అనుకోవాలి. కాకపోతే వన్ ప్లస్ ధరలు పోటీనిచ్చే మాదిరిగానే ఉంటాయి. కనుక ఇంతకంటే తక్కువ నిర్ణయిస్తుందేమో చూడాలి.

ఈ ఫోన్ ఫీచర్లు, ధర, విడుదల తేదీ తదితర వివరాలను కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. మార్కెట్లో అంచనాల మేరకు చూస్తే.. స్నాప్ డ్రాగన్ 8ప్లస్ 2జనరేషన్ చిప్ సెట్, 10 హెర్జ్ రీఫ్రెష్ రేటు, అమోలెడ్ డిస్ ప్లే, 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ వూక్ ఫాస్ట్ చార్జర్ ఉంటాయి. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతోపాటు మరో కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇవన్నీ మార్కెట్లో ఉన్న అంచనాలు మాత్రమే. విడుదలైన తర్వాత వీటిల్లో మార్పులు ఉండొచ్చు.

More Telugu News