Nara Lokesh: బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ.. వర్ధంతి మాత్రం టైమ్ తో సహా గుర్తుంటుంది: నారా లోకేశ్

Nara Lokesh comments on Jagan and Avinash on YS Vivekananda Reddy Jayanthi
  • నేడు వైఎస్ వివేకా 72వ జయంతి
  • బాబాయ్ జయంతిని అబ్బాయిలు మర్చిపోయినట్టు ఉన్నారన్న లోకేశ్
  • వేటు వేసిన చేతులతో ట్వీటు వేస్తే బాగోదనుకున్నారేమో అని ఎద్దేవా
ఈరోజు దివంగత వైఎస్ వివేకానందరెడ్డి 72వ జయంతి. ఈ సందర్భంగా సీఎం జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిలపై టీడీపీ యువనేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. వివేకానందరెడ్డి జయంతిని అబ్బాయిలు మర్చిపోయినట్టు ఉన్నారని లోకేశ్ అన్నారు. వీరికి బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ, వర్ధంతి మాత్రం డేట్, టైమ్ సహా గుర్తుంటుందనే విషయాన్ని సీబీఐ నిర్ధారించిందని చెప్పారు. వేటు వేసిన చేతులతో బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనేమో వేయలేదు అని ఎద్దేవా చేశారు. అబ్బాయిల వేధింపులు, కుతంత్రాలకు ఎదురొడ్డి చేస్తున్న న్యాయపోరాటంలో సునీత గెలుస్తారని అన్నారు. తన తండ్రిని చంపిన కన్నింగ్ కజిన్స్ తో ఊచలు లెక్క పెట్టించేంత వరకు ఆమె విశ్రమించరని చెప్పారు. వివేకా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YS Avinash Reddy
YSRCP
YS Vivekananda Reddy
Jayanthi

More Telugu News