malayalam: మలయాళ సినీ దర్శకుడు సిద్ధిక్ కి గుండెపోటు... పరిస్థితి విషమం

Malayalam director Siddique hospitalised condition critical
  • గుండెపోటు రావడంతో మధ్యాహ్నం కొచ్చి అమృత ఆసుపత్రిలో చేరిన డైరెక్టర్
  • ఈసీఎంఓ మెషీన్ సపోర్ట్ పై ఉన్నట్లు వెల్లడించిన వైద్యులు
  • ఆరోగ్య పరిస్థితిపై రేపు మెడికల్ బోర్డు సమావేశం
మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ గుండెపోటుతో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. 69 ఏళ్ల ఈ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతనికి కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మీడియా కథనాల ప్రకారం, సిద్ధిక్ న్యుమోనియా, కాలేయ వ్యాధి కారణంగా వైద్య సంరక్షణలో ఉన్నారు. ఈ అనారోగ్యాలతో చికిత్స కొనసాగుతుండగానే గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం సిద్దిక్‌కు ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఈసీఎంఓ) మెషిన్ సపోర్ట్ అందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి రేపు ఉదయం మెడికల్ బోర్డు సమావేశం కానుందని తెలుస్తోంది.

సిద్ధిక్ పప్పన్ ప్రియప్పేట్టా పప్పన్ సినిమాకు స్క్రిప్ట్, స్టోరీ రాశాడు. ఆ తర్వాత రామ్ జీ రావ్ స్పీకింగ్, ఇన్ హరిహర నగర్, గాడ్ ఫాదర్, వియత్నామ్ కాలనీ, కాబూలీవాలా తదితర చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. దర్శకుడు సిద్ధిఖ్ పలు సినిమాల్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా కనిపించాడు.
malayalam
director
cinema

More Telugu News