K Kavitha: మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కాంగ్రెస్ విజయమే: కవిత

  • కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలు అన్న కవిత
  • కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తమ పార్టీ విజయానికి కారణమవుతాయని వ్యాఖ్య
  • ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల ప్రయోజనం కోసమే విలీనమని స్పష్టీకరణ
Kavitha says BRS will win third time in Telangana

కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తమ పార్టీ విజయానికి కారణమవుతాయన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకోవడం కాంగ్రెస్ నైజమన్నారు.  ఆర్టీసీ విలీనంపై స్పందిస్తూ... ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల ప్రయోజనం కోసమే విలీనమని చెప్పారు. 

సచివాలయ నిర్మాణంపై కాంగ్రెస్ వివాదాన్ని సృష్టించిందన్నారు. నేల‌మాళిగ‌లు, గుప్త నిధుల కోసం స‌చివాల‌యం క‌డుతున్నామ‌న్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం విష‌యంలోనూ ఆస్తుల కోసమంటూ గందరగోళం చేస్తున్నారన్నారు. రుణ‌మాఫీ త‌మ ఎన్నిక‌ల ఎజెండా అని చెప్పారు. అలాంటి రుణమాఫీని కాంగ్రెస్ తమ విజయంగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం మాత్రం తప్పకుండా కాంగ్రెస్ విజయమే అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News