Nara Lokesh: సీఎం జగన్ ను కేరళ రాజు మార్తాండవర్మతో పోల్చిన నారా లోకేశ్

  • నాటి కేరళ రాజులు రొమ్ము పన్ను వేశారన్న లోకేశ్
  • ఆ పన్ను పేరు ముళకరం అని వెల్లడి
  • జగన్ అంతకంటే దుర్మార్గుడని విమర్శలు
  • ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేశాడని వ్యాఖ్యలు
Lokesh compares CM Jagan with Kerala king Marthanda Varma

టీడీపీ యువనేత నారా లోకేశ్ మాచర్ల నియోజకవర్గం కారంపూడి సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. పూర్వంలో కేరళను పాలించిన కొందరు రాజులు రొమ్ము పన్ను వేశారని, జగన్ అంతకంటే దుర్మార్గమైన పాలకుడు అని అభివర్ణించారు. కేరళ రాజులు విధించిన రొమ్ము పన్ను పేరు ముళకరం అని వెల్లడించారు. నాటి కేరళ రాజులు కూడా జగన్ ముందు దిగదుడుపేనని లోకేశ్ వ్యాఖ్యానించారు. 

"జగన్ పన్ను పేరు జే ట్యాక్స్. రొమ్ముపై పన్ను వేసింది మార్తాండ వర్మ అయితే, చెత్తపై కూడా పన్నేసిన పాలకుడు సైకో జగన్. పేదల ఏడుపులు ఆయనకి ఆనందాన్ని ఇస్తాయి, అందుకే విద్యుత్ ఛార్జీలు తొమ్మిదిసార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు మూడు సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. 

నాడు రాజు మార్తాండ వర్మపై పోరాడిన మహిళ పేరు నంగేలి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి మహిళా వీర మహిళ నంగేలిని ఆదర్శంగా తీసుకోని జగన్ ప్రభుత్వం పై పోరాడాలి, అప్పుడే పెంచిన పన్నులు తగ్గుతాయి" అని పిలుపునిచ్చారు


లోకేశ్ ప్రసంగంలో ఇతర ముఖ్య వివరాలు...

పిన్నెల్లి కాదు పిల్లి!

మాచర్లని అభివృద్ధి చేస్తాడని మీరు నాలుగుసార్లు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని గెలిపించారు. కానీ ఆయన చేసింది ఏంటి? మాచర్లలో అభివృద్ధి నిల్లు... అరాచకం ఫుల్లు. మాచర్లలో జరుగుతున్న అవినీతి, అరాచకాల గురించి తెలుసుకున్న తరువాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు మార్చాను. ఇక నుంచి అతని పేరు పిల్లి రామకృష్ణారెడ్డి. 

పిల్లి రామకృష్ణారెడ్డి, తమ్ముడు పిల్లి వెంకట్రామిరెడ్డి కలిసి నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే గ్రానైట్ లారీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి అంటే పిల్లి బ్రదర్స్ కి లారీకి రూ.23 వేల చొప్పున పన్ను కట్టాలి. రోజుకు 200 లారీల నుంచి రూ.46 లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నాలుగేళ్లలో దోచింది ఎంతో తెలుసా? రూ.700 కోట్లు. 

మాచర్లలో స్పెషల్...  పి బ్రాండ్ లిక్కర్ అమ్మకాలు

రాష్ట్రమంతా జగన్ జే బ్రాండ్లు అమ్ముతుంటే మాచర్లలో మాత్రం పి బ్రాండ్ లిక్కర్ అమ్ముతున్నారు పిల్లి బ్రదర్స్. పక్క రాష్ట్రాల మద్యం తెచ్చి అమ్మేస్తున్నారు. 77 గ్రామాలు ఉంటే, ఊరికి 5 బెల్టు షాపులు, నంబర్ లేని వాహనాల్లో పి బ్రాండ్ లిక్కర్ సరఫరా చేస్తున్నారు. ఒక్కో క్వార్టర్ పై పి ట్యాక్స్ రూ.60 చెల్లించాలి. లిక్కర్ లో రోజుకి రూ.25 లక్షల ఆదాయం వస్తోంది. 

గుట్కా, మట్కా, గంజాయి, పేకాట క్లబ్బులు అన్నీ పిల్లి బ్రదర్స్ గ్యాంగులే నడిపిస్తున్నాయి. ఆత్మకూరు,రాయవరం,అలుగురాజు పల్లి, అడిగొప్పల అమ్మవారి గుడి  పరిసర ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమంగా తవ్వేస్తున్నారు.ఒక్క గ్రావెల్ దోపిడీ లోనే పిల్లి బ్రదర్స్ ఆదాయం ఎంతో తెలుసా? రూ.70 కోట్లు. 

పిల్లి బ్రదర్స్ కు పసుపు జెండా అంటే హడల్ 

పిల్లి బ్రదర్స్ పిరికివాళ్లు. పసుపు జెండా చూస్తే వణికిపోతారు. పసుపు సైన్యాన్ని చూస్తే పారిపోతారు. పిల్లి బ్రదర్స్ పోలీసుల్ని, రౌడీలను అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారు. బీసీ నాయకులు చంద్రయ్య, జల్లయ్యలను కిరాతకంగా నడి రోడ్డు మీద నరికి చంపేశారు. 

టీడీపీ క్యాడర్ అమ్ముడుబోరన్న విషయాన్ని గుర్తించాలి. చంద్రయ్య గొంతుపై కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై చంద్రబాబు, జై టీడీపీ అన్నారు. అదీ టీడీపీ దమ్ము. 

పంగా వెంకటేశ్వర్లు, గన్నెబోయిన గంగరాజుని, కోటయ్యను హత్య చేశారు. పిల్లి బ్రదర్స్ చాలా పెద్ద తప్పు చేశారు. నా కార్యకర్త వైపు చూస్తేనే నేను ఉరుకోను అలాంటిది నాయకుల్ని, కార్యకర్తల్ని చంపారు. నేను ఊరుకుంటానా? పిల్లి బ్రదర్స్ కు భయాన్ని పరిచయం చేసే బాధ్యత నాది. 

మాచర్ల లో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అంటే బ్రహ్మారెడ్డి గారు గెలవాలి. పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటా.

More Telugu News