Sherlyn Chopra: రాహుల్ గాంధీతో పెళ్లికి సై అంటున్న బాలీవుడ్ భామ.. అయితే, ఒకేఒక్క షరతు!

Sherlyn Chopra says she will marry Rahul Gandhi if he agree
  • తన వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించిన షెర్లిన్ చోప్రా
  • రాహుల్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడి
  • రాహుల్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని స్పష్టీకరణ
బాలీవుడ్ శృంగార భామ షెర్లిన్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించింది. 50 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు సై అంటోంది. షెర్లిన్ చోప్రా నటించిన ఓ వెబ్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుండగా, అమ్మడు ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటోంది. 

ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ అంటే పడిచచ్చిపోతానని వెల్లడించింది. రాహుల్ ఓకే అంటే తాను పెళ్లికి రెడీ అని చెప్పింది. కాగా, షెర్లిన్ చోప్రా ఈ పెళ్లికి ఒకే ఒక్క కండిషన్ పెట్టింది. రాహుల్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ తన ఇంటి పేరులో మార్పు ఉండదని, ఈ కండిషన్ కు రాహుల్ అంగీకరిస్తే పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటోంది.
Sherlyn Chopra
Rahul Gandhi
Marriage
Bollywood
Congress
India

More Telugu News