Shahrukh Khan: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన షారుక్ .. 'జవాన్' లేటెస్ట్ పోస్టర్!

  • 'జవాన్'గా కనిపించనున్న షారుక్
  • ఆసక్తిని పెంచుతున్న డిఫరెంట్ లుక్స్
  • ప్రత్యేక ఆకర్షణగా నయన్ - దీపిక 
  • సంగీతాన్ని అందించిన అనిరుధ్ 
  • సెప్టెంబర్ 7వ తేదీన సినిమా రిలీజ్  
Jawan Movie Update

'పఠాన్' సినిమాతో సంచలనం సృష్టించిన షారుక్ ఖాన్, 'జవాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. షారుక్ సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. 

మొదటి నుంచి కూడా షారుక్ పోస్టర్స్ తోనే 'జవాన్' సినిమాపై అంచనాలు పెంచుతూ వెళుతున్నాడు. ఆయనకి సంబంధించిన డిఫరెంట్ లుక్స్ అభిమానుల్లో ఆసక్తినీ .. ఆత్రుతను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి షారుక్ కొత్త పోస్టర్ ను వదిలారు. చేతిలో రివాల్వర్ తో  .. గుండుతో కూడిన స్టైలీష్ లుక్ తో ఆయన ఆకట్టుకుంటున్నాడు. 

ఈ పోస్టర్లో షారుక్ గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాడు .. పరిశీలనగా చూస్తేనే షారుక్ అని అర్థమవుతుంది. కొత్తదనం కోసం షారుక్ వెనుకాడడనే విషయం తెలిసిందే. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలను పోషించగా, దీపిక పదుకొణె ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

More Telugu News