Gaddar: తీవ్రంగా కలచివేసింది: గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ లేఖ

  • గద్దర్ నాలుగేళ్ల పాటు అజ్ఞాత జీవితాన్ని కొనసాగించారని లేఖలో పేర్కొన్న మావోయిస్ట్ పార్టీ
  • గద్దర్ చేత జనచైతన్య మండలిని ఏర్పాటు చేయించామని వెల్లడి
  • 2012లో మావోయిస్ట్ పార్టీకి రాజీనామా చేస్తే, ఆమోదించామన్న పార్టీ
Maoist Party letter on Gaddar death

ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ స్పందించింది. గద్దర్ మృతి తీవ్రంగా కలచివేసిందని లేఖ ద్వారా తెలిపింది. గద్దర్ నాలుగేళ్ల పాటు అజ్ఞాత జీవితాన్ని కొనసాగించారని ఆ లేఖలో పేర్కొంది. అయితే ఆయన అవసరాన్ని గుర్తించి తాము అజ్ఞాతం నుండి బయటకు పంపించినట్లు తెలిపింది. ఆ తర్వాత గద్దర్ చేత జనచైతన్య మండలిని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చామని తెలిపింది. 2012 వరకు పీడీత ప్రజల పక్షాన నిలిచిన గద్దర్ ఆ తర్వాత పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారని వెల్లడించింది. ఇతర పార్టీలతో కలిసినందుకు షోకాజ్ నోటీసు ఇచ్చామని గుర్తు చేసింది. అదే సంవత్సరం పార్టీకి రాజీనామా చేశారని, దానిని తాము ఆమోదించామని వెల్లడించింది.

More Telugu News