Stock Market: ఐటీ సూచీ అండతో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 80 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, హెల్త్ కేర్ సూచీలు మార్కెట్లను లాభాల్లో నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడి 65,953కి పెరిగింది. నిఫ్టీ 80 పాయింట్లు పుంజుకుని 19,597కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.23%), సన్ ఫార్మా (2.03%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.63%), టీసీఎస్ (1.20%), ఇన్ఫోసిస్ (1.04%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.94%), టాటా మోటార్స్ (-0.81%), యాక్సిస్ బ్యాంక్ (-0.43%), కోటక్ బ్యాంక్ (-0.43%), బజాజ్ ఫైనాన్స్ (-0.40%).

More Telugu News