Ambati Rambabu: చంద్రబాబు గారూ! ఇప్పటికైనా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇస్తారా?: అంబటి

Ambati Rambabu three questions to Chandrababu
  • జాతీయ ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు?
  • కాపర్ డ్యాంల  నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ ఎలా నిర్మించారు?
  • 2018 కి పూర్తి చేస్తానని చెప్పి, ఎందుకు విఫలమయ్యారు? అంటూ అంబటి ప్రశ్నలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పోలవరం పర్యటన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ఆయనకు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు గారూ! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని ప్రశ్నించారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీనిని కేంద్రం నిర్మించాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్రమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఎలా నిర్మించారు? 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఎందుకు విఫలమయ్యారు? అని మూడు ప్రశ్నలు సంధించారు. అంబటి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
Ambati Rambabu
Chandrababu
YSRCP
Telugudesam

More Telugu News