Chandrayaan 3: చంద్రుడి ఉపరితలాన్ని దగ్గరగా చూశారా? చంద్రయాన్-3 పంపిన వీడియో ఇదిగో

  • గోతుల మయంగా చంద్రుడి ఉపరితలం
  • దగ్గరగా చిత్రాలు తీసి పంపిన చంద్రయాన్
  • విడుదల చేసిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
First video of Chandrayaan 3 meeting the Moon

చంద్రయాన్ -3 కీలక దశకు చేరుకుంది. చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా అడుగు పెట్టింది. చంద్రయాన్ -3 చంద్రుడి ఉపరితలాన్ని చాలా సమీపం నుంచి తీసిన చిత్రాలను, వీడియోని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ విడుదల చేసింది. ‘‘ఆగస్ట్ 5న చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక ప్రవేశించిన సందర్భంగా తీసిన చిత్రాలు’’అని ఇస్రో పేర్కొంది.

కక్ష్య కుదింపునకు ముందు ఇస్రో వీడియోని విడుదల చేయడం గమనార్హం. శనివారం రాత్రి 7 గంటలకు చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3ని ప్రవేశపెట్టినట్టు అంతకుముందు ఇస్రో ప్రకటించడం తెలిసిందే. ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని జులై 14న షార్ నుంచి ప్రయోగించారు. ఇప్పటి వరకు మూడు లక్షల కిలోమీటర్ల మేర అది ప్రయాణించింది. చంద్రయాన్ పంపిన చిత్రాలు, వీడియోని పరిశీలిస్తే చంద్రుడి ఉపరితలం తెల్లని మంచు ముద్ధ మాదిరిగా, గోతుల మయంగా కనిపిస్తోంది.  

More Telugu News