Assam: అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అవమానం భరించలేక ఆత్మహత్య

Bodies of two teenage girls found hanging from tree

  • అసోంలోని కామరూప్ జిల్లాలో ఘటన
  • నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకున్న బాధిత అమ్మాయిలు
  • పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అసలు విషయం తెలుస్తుందన్న పోలీసులు

అసోంలో మరో దారుణం జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లలపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అవమానాన్ని భరించలేని వారిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామరూప్ జిల్లాలోని తులసిబారి ప్రాంతంలో జరిగిందీ ఘటన. వరుసకు అక్కాచెల్లెళ్లయిన 17, 19 సంవత్సరాలున్న అమ్మాయిలపై కొందరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. 

తీవ్ర మనస్తాపానికి గురైన వారిద్దరూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న వారి మృతదేహాలను చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వారిపై అత్యాచారం జరిగిందని, అవమానం భరించలేకే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఏమీ మాట్లాడలేమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News