Telangana: తెలంగాణ ఎస్సై, ఏఎస్సై నియామక తుది ఫలితాలు విడుదల

Telangana Police recruitment final results released
  • గతేడాది ఆగస్టు 7న పోలీసు నియామకాలకు ప్రిలిమ్స్
  • 2.47 లక్షల మంది హాజరు
  • గతేడాది అక్టోబరులో ఫలితాల వెల్లడి
  • ఆపై దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్ ఎగ్జామ్ నిర్వహణ
  • నేడు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా వెల్లడి
తెలంగాణలో 2022 ఆగస్టు 7 నుంచి ఎస్సై, ఏఎస్సై నియామక ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ ప్రకటించగా, 2.47 లక్షల మంది ప్రిలిమ్స్ కు హాజరయ్యారు. అక్టోబరులో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించగా... 46.80 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వారికి ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టులు నిర్వహించారు. అందులోనూ అర్హత సాధించినవారికి తుది పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో నేడు ఫలితాలు విడుదల చేశారు. 

ఎంపికైన అభ్యర్థుల జాబితాలను కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి పంచుకుంది. ఎంపికైన వారిలో 443 మంది పురుషులు, 153 మంది మహిళలు ఉన్నారు. కాగా, ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత ప్రవర్తన, గత చరిత్రను ఆరా తీసి, ఆపై వారికి అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Telangana
Police Recruitment
Results

More Telugu News