Gaddar: గద్దర్ ఎందువల్ల మరణించారో చెప్పిన వైద్యులు

Doctors told Gaddar dies off lungs and urinary tract problmes
  • ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన గద్దర్
  • హైదరాబాదు అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • గద్దర్ మృతిపై ప్రకటన విడుదల చేసిన అపోలో వైద్యులు
ప్రజా యుద్ధనౌక, జన ఉద్యమగళం గద్దర్ ఈ మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గద్దర్ మృతిపై హైదరాబాదులోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

జులై 20న తీవ్ర గుండె సమస్యతో గద్దర్ ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఆగస్టు 3న గద్దర్ కు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిపారు. బైపాస్ సర్జరీ తర్వాత గద్దర్ కొంత కోలుకున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు వివరించారు. 

అయితే, గద్దర్ కు చాలాకాలంగా ఊపిరితిత్తులు, మూత్రనాళ సమస్యలు ఉన్నాయని వారు వెల్లడించారు. ఊపిరితిత్తులు, మూత్రనాళ సమస్యలతోనే గద్దర్ మృతి చెందారని స్పష్టం చేశారు.
Gaddar
Death
Apollo Doctors
Statement
Hyderabad
Telangana

More Telugu News