Gaddar: బ్రేకింగ్ న్యూస్.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్నుమూత

  • ఇటీవల గుండెపోటుకు గురైన గద్దర్
  • అపోలో ఆసుపత్రిలో చేరిన ప్రజా యుద్ధనౌక
  • ఆరోగ్యం విషమించి ఈరోజు తుదిశ్వాస 
  • తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్
  • పాటలతో పోరాటానికి ఊపిరిలూదిన వ్యక్తి
Gaddar passes away

ప్రజా యుద్ధ నౌక గద్దర్(74) ఇకలేరు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. చివరికి ఆరోగ్యం విషమించి ఈరోజు తుదిశ్వాస విడిచారు.


1949లో తూప్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్నో పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. 

1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా గద్దర్ చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల. ఆయనకు ముగ్గురు పిల్లలు– సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో చనిపోయారు), వెన్నెల ఉన్నారు.

మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. యాదగిరి పాడిన ‘బండెనక బండి కట్టి’ అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. 1997 ఏప్రిల్ 6న పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆయన శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఒక బుల్లెట్ ఆయన శరీరంలో ఇప్పటికీ ఉంది.

More Telugu News