Bihar: రైల్వే పట్టాలపై పనిచేస్తుండగా దూసుకొచ్చిన రైలు.. కిందనున్న నదిలోకి దూకేసిన కార్మికుడు

Labourer Jumps off Railway Bridge on Seeing Moving Train
  • బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఘటన
  • తాడు సాయంతో కార్మికుడిని కాపాడిన స్థానికులు
  • ఆసుపత్రికి తరలించిన రైల్వే పోలీసులు
రైల్వే పట్టాలపై పనిలో ఉన్న ఓ కార్మికుడు అకస్మాత్తుగా రైలు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు మరో ఆలోచన లేకుండా కిందనున్న నదిలోకి దూకేశాడు. బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అశోక్ కుమార్ అనే కార్మికుడు రైల్వే పట్టాలపై పనిచేస్తుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. తప్పించుకునే మార్గం లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భాగ్‌మతీ నదిలోకి దూకాడు.

అతడు నదిలో దూకడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్ద తాడును నదిలోకి విసిరి అశోక్‌ను కాపాడారు. మరోవైపు, సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు. అశోక్ ఓ ప్రైవేటు రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Bihar
Saharsa
Railway

More Telugu News