Nimmagadda Ramesh Kumar: దుగ్గిరాలలో ఓటుకోసం దరఖాస్తు చేసుకున్న మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ

  • గతంలో దరఖాస్తు చేసుకుంటే నిరాకరణ
  • స్థానికంగా లేరన్న కారణంతో తిరస్కరణ
  • ఇంటికి వచ్చిన బీఎల్వో వద్ద ఓటు కోసం దరఖాస్తు పెట్టుకున్న రమేశ్‌కుమార్
Nimmagadda Ramesh Kumar Apply For Vote In Duggirala

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అక్కడ ఉండడం లేదంటూ గతంలో ఓటు హక్కును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న తన ఓటును 2020లోనే సరెండర్ చేశానని తెలిపారు. అప్పుడే దుగ్గిరాలలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. తాను స్థానికంగా లేనన్న కారణంతో ఓటుహక్కును తిరస్కరించినట్టు చెప్పారు. 

ఈ నేపథ్యంలో ఇంటింటా ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా నిన్న తన ఇంటికి వచ్చిన బీఎల్వో వద్ద ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. తాను ఇక్కడే పుట్టి, చదువుకున్నానని, ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటున్నట్టు తెలిపారు. గతంలో తనకు ఓటుహక్కు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించానని, పూర్తి ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేయమని చెప్పడంతో ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నట్టు రమేశ్ కుమార్ తెలిపారు.

More Telugu News