Indigo Airlines: ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ.. 90 నిమిషాల పాటు నరకం

  • పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ ట్వీట్
  • ఇండిగో విమానం టేకాఫ్ నుంచి లాండయ్యే వరకూ ఏసీలు పనిచేయక ఇబ్బందులు పడ్డామని ఫిర్యాదు
  • టిష్యూ పేపర్లతో శ్వేదం తుడుచుకున్నామన్న కాంగ్రెస్ నేత
  • విమానంలోని దృశ్యాలు నెట్టింట వైరల్
No AC on IndiGo flight passengers handed tissues to wipe sweat punjab congress committe president amarinder singh raja warring

విమానంలో ఏసీలు పనిచేయకపోవడంతో తాము 90 నిమిషాల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డామంటూ పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ శనివారం ట్వీట్ చేశారు. ఇండిగో విమానంలో చండీఘడ్ నుంచి జైపూర్ వెళుతుండగా ఈ పరిస్థితి ఎదురైనట్టు చెప్పుకొచ్చారు. తొలుత తాము విమానంలోకి వెళ్లేందుకు 10 నుంచి 15 నిమిషాల పాటు సెగలు కక్కుతున్న వాతావరణంలో క్యూలో నిలబడాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తరువాత ఏసీ ఆన్‌లో లేకపోయినా విమానం టేకాఫ్ అయినట్టు వివరించారు. 

‘‘విమానం బయలుదేరిన దగ్గర నుంచి ప్రయాణం ముగిసే వరకూ ప్రయాణికులందరూ ఏసీ లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంత పెద్ద సమస్యను పట్టించుకున్న వారే లేరు. శ్వేదం తుడుచుకునేందుకు మా అందరికీ ఎయిర్‌హాస్టస్ బోలెడన్ని టిష్యూ పేపర్లు ఇచ్చింది. ప్రయాణికులు తమ వద్ద ఉన్న పేపర్లు, టిష్యులతో విసురుకుంటూ కనిపించారు’’ అని ఆయన ట్వీట్ చేశారు. డీజీసీఏ, ఏఏఐలను కూడా తన ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.

More Telugu News