KTR: 'బలగం' సినిమా చూసి నా ఫ్యామిలీ ఆ ప్రశ్న వేసింది: అసెంబ్లీలో కేటీఆర్

  • వేణు ఎల్దండి తీసిన బలగం సినిమా చాలా బాగుందని కితాబు
  • ఈ సినిమాలో బంధాలను చూపిన తీరు అందర్నీ కన్నీరు పెట్టించిందన్న మంత్రి
  • సినిమా తీసిన కోనారావుపేట కోనసీమలా కనిపించిందన్న కేటీఆర్
KTR talks about Balagam movie in Assembly

సిరిసిల్ల నియోజకవర్గానికే చెందిన ఎల్దండి వేణు తీసిన బలగం సినిమా చాలా బాగుందని, ఆ సినిమాలో బంధాలను, అనుబంధాలను చూపించిన తీరు అందర్నీ కన్నీరు పెట్టించిందని, ఈ సినిమాలో బంధాలతోపాటు పల్లె ప్రకృతిని చూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ... ఈ సినిమా షూటింగ్ మొత్తం వేములవాడ నియోజకవర్గంలోని కోనారావుపేటలో జరిగిందన్నారు.

తానూ కుటుంబ సభ్యులతో పాటు ఈ సినిమాను చూశానని, ఈ సినిమాలో గ్రామంలో పల్లె ప్రకృతి కనిపించిందని కేటీఆర్ అన్నారు. సినిమాను చూసిన తన కుటుంబ సభ్యులు బలగంలో ఉన్న ఊరు కోనారావుపేటనా? కోనసీమనా? అని అడిగారని చెప్పారు.

కేసీఆర్ తెలంగాణ గ్రామాలను ఈ స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ గ్రామాలు కోనసీమలా మారాయన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణలోని వివిధ గ్రామాలకు చెందిన ఫోటోలను అసెంబ్లీలో ప్రదర్శించారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డ్, మిషన్ కాకతీయ చెరువు, మిషన్ భగీరథ ట్యాంకులు, వైకుంఠధామం కనిపిస్తాయన్నారు. ఏ గ్రామం ఫోటో తీసినా ఇవన్నీ కనిపిస్తాయన్నారు.

More Telugu News