earbuds: వింగ్స్ కంపెనీ నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ధర రూ. వెయ్యి లోపే!

Wings launching new earbuds Wings Flobuds 200 TWS price and features
  • టచ్ కంట్రోల్, ఐపీఎక్స్ 5 రేటింగ్‌ సహా అత్యాధునిక ఫీచర్లు
  • నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో తయారీ
  • రూ.899 లకే వీటిని సొంతం చేసుకోవచ్చు అంటున్న కంపెనీ
గ్యాడ్జెట్స్ తయారీలో పేరొందిన కంపెనీ వింగ్స్ తాజాగా సరికొత్త ఇయర్ బడ్స్ ను అతి తక్కువ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్లోబడ్స్ 200 టీడబ్ల్యూఎస్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఇయర్ బడ్స్ ధర కేవలం రూ.899 మాత్రమేనని వెల్లడించింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ తో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ వివరించింది. తక్కువ ధరలో రిచ్ లుక్ తో ఇయర్ బడ్ కేస్ ను డిజైన్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇయర్ బడ్స్ కేస్ సెమీ ట్రాన్స్ పరెంట్ గా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ బడ్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశామని, అయితే నాణ్యత, ఫీచర్ విషయంలో మాత్రం రాజీ పడలేదని కంపెనీ తెలిపింది. ఇందులో 13ఎంఎం హై-ఫిడిలిటీ డ్రైవర్ లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. టచ్ కంట్రోల్ తో పనిచేయడం వీటి ప్రత్యేకత అని వివరించింది. దీంతో పాటు ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీని కూడా ఈ ఇయర్ బడ్స్ లో పొందుపరిచినట్లు తెలిపింది. దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్‌ కోసం ఐపీఎక్స్ 5 రేటింగ్‌ తో వీటిని తయారు చేసినట్లు పేర్కొంది.
earbuds
Flobuds 200 TWS
Wings
low price earbuds
gadgets
business

More Telugu News