Srirangam temple: ప్రసిద్ధ శ్రీరంగం ఆలయంలో కూలిన గోపురం భాగం

  • శనివారం తెల్లవారుజామున తూర్పు గోపురంలో కూలిన చిన్న భాగం
  • భక్తులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు
Portion of Srirangam temple collapses in Tamil Nadu no casualties

దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీరంగం ఆలయం ఒకటి. శనివారం తెల్లవారుజామున తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో ఉన్న అరుల్మిగు రంగనాథస్వామి ఆలయం స్వల్పంగా దెబ్బతింది. తూర్పు గోపురంలోని ఓ చిన్న భాగం కూలిపోయిది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

వెంటనే స్పందించిన ఆలయ అధికారులు.. పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. శిథిలాలను అక్కడి నుంచి తొలగించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆలయ నిర్మాణాల్లో పలు చోట్ల పగుళ్లు వచ్చినట్లు గతంలోనే తాము అధికారులకు ఫిర్యాదు చేశామని స్థానికులు కొందరు చెప్పారు. గోపురం పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.98 లక్షలు ఖర్చు అవుతాయని ఇటీవలే అంచనాలను రూపొందించామని, ఈ లోపే ఇలా జరిగిందని ఓ సీనియర్ అధికారి చెప్పారు.

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగంలో ఆలయ నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. 155 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయంలో మొత్తం 81 మందిరాలు, 21 గోపురాలు, 39 మండపాలు ఉన్నాయి. 

More Telugu News