Ola: ఓలా నుంచి ప్రైమ్ ప్లస్ సర్వీస్ ప్రారంభం

  • హైదరాబాద్, బెంగళూరు, పుణేలో ప్రారంభం
  • రైడింగ్ పరంగా మరింత సౌకర్యం
  • ట్రిప్ ను డ్రైవర్ రద్ధు చేయడానికి ఆప్షన్ ఉండదు
Ola Prime Plus service now available in 4 Indian cities

ఓలా క్యాబ్ సేవలను వినియోగించుకునే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన తాజా విషయం ఇది. క్యాబ్ అగ్రిగేటర్ అయిన ఓలా కొత్తగా  ప్రైమ్ ప్లస్ సేవలను ప్రారంభించింది. బెంగళూరులో ప్రయోగాత్మకంగా ముందు దీన్ని అమలు చేసి చూసింది. విజయవంతం కావడంతో హైదరాబాద్ సహా మరిన్ని పట్టణాల్లో ఈ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ముంబై, పుణె సహా ముఖ్య పట్టణాల్లో ఈ సేవలు ఈ నెల 4 నుంచి అమల్లోకి వచ్చాయి.  

ప్రస్తుతం ఓలా ఆఫర్ చేస్తున్న క్యాబ్ బుకింగ్ తో పోలిస్తే ప్రైమ్ ప్లస్ సేవలు మరింత సౌకర్యాన్నిస్తాయి. ఈ విషయాన్ని కంపెనీయే స్వయంగా ప్రకటించింది. ప్రైమ్ ప్లస్ లో ప్రొఫెషనల్ డ్రైవర్లు, టాప్ రేటింగ్ పొందిన డ్రైవర్లే ఉంటారని, రైడ్ రద్దు కాకుండా ఉంటుందనే భరోసా కూడా ప్రైమ్ ప్లస్ సేవలో లభిస్తాయి. ట్రిప్ లను డ్రైవర్లు రద్ధు చేయడానికి ఇందులో ఆప్షన్ ఉండదు. బెంగళూరుకే పరిమితం కాకుండా మిగిలిన ముఖ్య పట్టణాలలోనూ పూర్తి స్థాయిలో ఈ సేవలు అందించడానికి సిద్ధమైనట్టు ఓలా ప్రకటించింది. 

ప్రీమియం సేవలు కనుక సాధారణ క్యాబ్ చార్జీల కంటే ఎక్కువగా ఉంటాయా? అన్న సందేహం రావచ్చు. అన్ని వేళల్లో కాదు కానీ, కొన్ని రద్దీ వేళల్లో మాత్రం ప్రైమ్ ప్లస్ చార్జీలు పెరగొచ్చు.  చార్జీలు ఎంత ఉంటాయనే దానికి ఓలా సీఈవో అగర్వాల్ ఒక సంకేతం కూడా ఇచ్చారు. ప్రైమ్ ప్లస్ లో 16 కిలోమీటర్లు లేదా ఒక గంట ప్రయాణానికి రూ.455 వరకు తీసుకుంటున్నారు. అదే మినీ క్యాబ్ బుక్ చేసుకుంటే అప్పుడు రైడ్ కాస్ట్ రూ.535 అవుతుందని చెప్పారు.

More Telugu News