Nara Lokesh: ​రేపటి నుంచి మళ్లీ లోకేశ్ యువగళం పాదయాత్ర

Lokesh Yuvagalam Padayatra will continue from tomorrow
  • నేడు మంగళగిరి కోర్టుకు వచ్చిన లోకేశ్
  • పరువునష్టం కేసులో వాంగ్మూలం
  • ఇవాళ పాదయాత్రకు విరామం
  • ఆగస్టు 5న వినుకొండ నియోజకవర్గం నుంచి యువగళం పునఃప్రారంభం
పరువునష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు మంగళగిరి వచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు పని నేపథ్యంలో ఇవాళ యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. రేపటి నుంచి యథావిధిగా లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది. 

రేపు (ఆగస్టు 5) పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వనికుంట క్యాంప్ సైట్ నుంచి యువగళం పునఃప్రారంభం కానుంది. స్థానికంగా వివిధ వర్గాలతో లోకేశ్ సమావేశం కానున్నారు. 

కాగా, ఇవాళ మంగళగిరి మున్సిఫ్ కోర్టుకు వచ్చిన సందర్భంగా లోకేశ్ ను కలిసేందుకు న్యాయవాదులు పోటీలుపడ్డారు. ఆయన ఫొటోలకు న్యాయవాదులు ఆసక్తి చూపించారు. ఎవరినీ నిరాశపర్చకుండా లోకేశ్ వారితో ఫొటోలు దిగారు.
Nara Lokesh
Yuva Galam Padayatra
Vinukonda
Palnadu District
TDP

More Telugu News