Alexei Navalny: పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీకి మరో 19 ఏళ్ల జైలుశిక్ష

Alexei Navalny gets another 19 years prison term
  • ఓ దశలో పుతిన్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన విపక్ష నేత నావల్నీ
  • విష ప్రయోగానికి గురై చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన వైనం
  • అవినీతి ఆరోపణలతో అరెస్ట్
  • ఇప్పటికే పదకొండున్నరేళ్ల జైలుశిక్ష
  • తాజాగా మోపిన అభియోగాలు నిర్ధారణ కావడంతో అదనపు శిక్ష
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పెట్టుకోవడం అంటే కొరివితో తలగోక్కున్నట్టేనని చెబుతుంటారు. పుతిన్ ను ఎదిరించినవాళ్లు అనుమానాస్పదంగా మరణించిన ఘటనలు, కొందరికి జీవితఖైదు శిక్షలు పడిన ఉదంతాలు ఉన్నాయి. 

పుతిన్ విమర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విపక్ష నేత అలెక్సీ నావల్నీ పరిస్థితి కూడా ఇంతేనని తాజా ఘటన నిరూపిస్తోంది. ఇప్పటికే జైలుపాలైన నావల్నీకి తాజా అభియోగాల నిర్ధారణతో అదనంగా మరో 19 ఏళ్లు జైలు శిక్ష ఖరారైంది. 

నల్లని జైలు యూనిఫాంలో ఉన్న నావల్నీ ఇవాళ మాస్కోలోని కోర్టుకు హాజరయ్యారు. కోర్టు బోనులో చేతులు కట్టుకుని నిలబడి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను వింటున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అయితే జడ్జి ఏం చెబుతున్నాడన్నది ఆడియో నాణ్యత లేని కారణంగా స్పష్టం కాలేదు. 

అవినీతి, తదితర అభియోగాల నేపథ్యంలో ఇప్పటికే నావల్నీకి పదకొండున్నరేళ్ల జైలుశిక్ష పడింది. 47 ఏళ్ల నావల్నీపై ఇంకా మరిన్ని అభియోగాలు మోపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నావల్నీపై ఓసారి విషప్రయోగం జరగ్గా, చావు తప్పించుకున్నాడు. వైద్యులు అతికష్టమ్మీద బతికించినా, రష్యాలో జైలుపాలు కాకతప్పలేదు.
Alexei Navalny
Prison Term
Opposition Leader
Vladimir Putin
Russia

More Telugu News