Chandryaan-3: ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3లో రేపు కీలక ఘట్టం

  • జులై 14న చంద్రయాన్-3 ప్రయోగం
  • రేపు చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్
  • చంద్రుని దిశగా స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే అత్యధిక దూరం పయనించిందన్న ఇస్రో
  • ఆగస్టు 23 నాటికి చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విక్రమ్ ల్యాండర్!
Chandryaan 3 space craft will enter lunar orbit tomorrow

భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3లో రేపు కీలక ఘట్టం జరగనుంది. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్  శనివారం నాడు చంద్రుడి కక్ష్యలోనికి ప్రవేశించనుంది. చంద్రయాన్-3 ఇప్పటికే జాబిల్లి దిశగా అత్యధిక దూరం పయనించింది. ఆగస్టు 5 రాత్రి 7 గంటలకు ఇది చంద్రుని కక్ష్యలో ప్రవేశించనుందని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. 

కాగా, ఈ స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. ఈ మేరకు ఇస్రో అంచనా వేస్తోంది. 

చంద్రుడిపై సాఫీగా దిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ కు ఇదే ప్రధానమైన తేడా. 

నాడు, ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు మూగబోయాయి. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా, విక్రమ్ ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేశారు.

More Telugu News