Dabur: డాబర్ తేనెలో కేన్సర్ కారకాలు ఉన్నాయా..? కంపెనీ ఏం చెబుతోంది?

  • డాబర్ తేనెలో కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయంటూ వార్తలు
  • ఉద్దేశపూర్వకంగా చేస్తున్న చెడు ప్రచారంగా పేర్కొన్న కంపెనీ
  • డాబర్ తేనె స్వచ్ఛతకు హామీ ఇస్తున్నామంటూ ప్రకటన
Heres what Dabur has to say on honey controversy

దేశంలో అత్యధికంగా విక్రయమయ్యే డాబర్ తేనెలో కేన్సర్ కారకాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు వినియోగదారుల్లో అలజడికి కారణమయ్యాయి. సంఘటిత తేనె మార్కెట్లో డాబర్ కంపెనీకి ఎక్కువ వాటా ఉంది. డాబర్ తేనెలో కార్సినోజెనిక్ మెటీరియల్స్ ఉన్నాయంటూ గురువారం వార్తలు వచ్చాయి. కానీ, వీటిని డాబర్ ఇండియా ఖండించింది. ఇందుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘మేము కూడా ఈ వార్తల గురించి విన్నాం.  డాబర్ హనీ స్వచ్ఛతకు మేము హామీ ఇస్తున్నాం. డాబర్ తేనె ఏ ఫ్యాక్టరీలో తయారైనప్పటికీ, ప్రతీ బ్యాచ్ కూడా ఎఫ్ఎస్ఎస్ఏ ప్రమాణాల మేరకు ఉంటుంది. ముడి తేనె నుంచి దాన్ని శుద్ధి చేసి, ప్యాకింగ్ అనంతరం తుది ఉత్పత్తిగా తయారయ్యే వరకు అన్ని దశల్లోనూ ఎఫ్ఎస్ఎస్ఏ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తాం’’ అని డాబర్ ఇండియా సీఎఫ్ వో అంకుర్ జైన్ ప్రకటించారు. డాబర్ తేనెలో కేన్సర్ కారకాలు ఉన్నాయనేది ఉద్దేశపూర్వకంగా వెలుగులోకి తీసుకొచ్చిన నివేదికగా పరిగణిస్తున్నట్టు చెప్పారు.

డాబర్ తేనెకి ఇటీవలే అగ్ మార్క్ ప్రత్యేక సర్టిఫికెట్ కూడా లభించినట్టు అంకుర్ జైన్ తెలిపారు. భారత్ లో డాబర్ తయారు చేసే తేనె ఎంతో స్వచ్ఛమైనదిగా పేర్కొన్నారు.

More Telugu News