Team India: భారత జట్టులో అద్భుతాలు చేయబోతున్నాడంటూ హైదరాబాదీ తిలక్ వర్మపై పాండ్యా ప్రశంసల వర్షం

  • వెస్టిండీస్ తో తొలి టీ20లో అరంగేట్రం చేసిన తిలక్, ముకేశ్ కుమార్
  • 22 బంతుల్లో 39 పరుగులు చేసిన తిలక్
  • మ్యాచ్ లో ఓడిన భారత్
Going to do wonders Hardik Pandya big prediction on Tilak varma

వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఓడిపోయినా.. ఈ పోరులో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ, ముకేశ్ కుమార్ లపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మను ఆకాశానికి ఎత్తేశాడు. ‘తిలక్ తన ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ను రెండు సిక్సర్లతో ప్రారంభించడం చెడ్డ మార్గం కాదు. తిలక్ ఆత్మవిశ్వాసం, నిర్భయంగా షాట్లు ఆడే విధానం చూస్తే అతను ఎంతో దూరం వెళ్లనున్నాడు. టీమిండియాకు అతను అద్భుతాలు చేయబోతున్నాడు’ అని పేర్కొన్నాడు. 
 
 ఇక పేసర్ ముకేశ్  వెస్టిండీస్  పర్యటనలో రెండు వారాల్లోనే మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం బాగుందన్నాడు. ‘తను చాలా మంచోడు. మంచి మనసున్న వ్యక్తి. జట్టు కోసం తన వంతు కృషి చేయాలని చూస్తున్నాడు. వరుసగా రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ అద్భుతంగా ఉంది’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.  కాగా, ఈ మ్యాచ్ లో  ముకేశ్‌ ఒక్క వికెట్‌ కూడా తీసుకోలేకపోయాడు. అదే సమయంలో తిలక్ తన ఇన్నింగ్స్‌ ను సానుకూలంగా. ఎదుర్కొన్న రెండు, మూడో బంతులను సిక్సర్లుగా మలిచాడు. అతను 22 బంతుల్లో 39 పరుగులు చేసిన తర్వాత ఫాస్ట్ బౌలర్ రొమారియో షెపర్డ్ కు వికెట్ ఇచ్చుకున్నాడు.

More Telugu News