sand: ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు

  • 110 రీచ్‌లలో వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశం
  • సుప్రీంకోర్టు ఆదేశాలను తీర్పులో పేర్కొన్న ఎన్జీటీ
  • పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని వ్యాఖ్య
NGT orders to stop sand reaching in AP

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు ఇచ్చింది. మొత్తం 110 ఇసుక రీచ్‌లలో వెంటనే తవ్వకాలు నిలిపేయాలని ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై నాగేంద్రకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఎన్జీటీ తన తీర్పులో పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం అరణియార్ నదిలోని పద్దెనిమిది ఇసుక రీచ్‌లకే పరిమితం కాదని వెల్లడించింది.

తమ అదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ట్రైబ్యునల్ తీర్పుకు వక్రభాష్యం చెప్పిందని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఉత్తర్వులను అమలు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News