Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ పని దినాలపై స్పష్టత రాలేదు.. సభాపతికి లేఖ రాస్తాం!: మల్లు భట్టివిక్రమార్క

  • అతి తక్కువ రోజులు అసెంబ్లీని నడిపించిన చరిత్ర దక్కుతుందని ఎద్దేవా
  • 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని లేఖ రాస్తామన్న భట్టి
  • సభలో పలు అంశాలపై చర్చ జరగాల్సి ఉందని వెల్లడి
Mallu Bhatti on Assembly sessions in Telangana

దేశంలోనే అతి తక్కువ రోజులు అసెంబ్లీని నడిపించిన చరిత్ర ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ అడగగా, ప్రభుత్వం మూడు రోజులకు పరిమితం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 

ఈ అంశంపై మల్లు భట్టి మాట్లాడుతూ... అసెంబ్లీ పని దినాలపై పూర్తి స్పష్టత ఇవ్వలేదన్నారు. అయితే ప్రభుత్వం కేవలం మూడు రోజులు మాత్రమే సభ నడపాలని చూస్తోందని విమర్శించారు. సమావేశాలను ఇరవై రోజుల పాటు నిర్వహించాలని కోరుతూ సభాపతికి లేఖ రాస్తామన్నారు. పోడు భూములు, ధరణి, సింగరేణి, బీసీ ప్లాన్‌పై శాసన సభలో చర్చ జరగాల్సి ఉందన్నారు. మైనార్టీ, ఎస్సీ సబ్ ప్లాన్‌పై చర్చకు డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు.

More Telugu News