Chiranjeevi: 'భోళాశంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు!

  • 'భోళాశంకర్'గా సందడి చేయనున్న చిరంజీవి 
  • ఆయన మాస్ యాక్షన్ ఈ సినిమాకి ప్రధానమైన బలం 
  • ఇప్పటికే కనెక్ట్ అయిన మహతి స్వరసాగర్ బీట్స్ 
  • ఆగస్టు 11వ తేదీన సినిమా విడుదల      

Bhola Shankar movie update

చిరంజీవి మరోసారి మాస్ రోల్ ను పోషించిన సినిమా 'భోళా శంకర్'. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించగా, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. చిరంజీవి సరసన నాయికగా తమన్నా అలరించనుండగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ సెంటిమెంట్ ను పండించనుంది. 

ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను కూడా ఖరారు చేశారు. హైదరాబాద్ లోని 'శిల్పకళావేదిక'లో ఈ నెల 6వ తేదీన రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుకను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. 

తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పాత్రలో మెగాస్టార్ చేసే మేజిక్ గురించే అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలం క్రితమే రజనీకి చెల్లెలిగా చేసిన కీర్తి సురేశ్, ఆ వెంటనే మెగాస్టార్ కి చెల్లెలిగా చేయడం విశేషం.

More Telugu News