Amit Shah: ఓట్లు, అధికారం కోసం పొత్తు పెట్టుకోవడం కాదు: అమిత్ షా

Amit Shah attacks INDIA bloc on services bill Think about Delhi not alliance
  • ఢిల్లీ పాలనాధికారాల నియంత్రణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి విమర్శలు 
  • ప్రతిపక్షాలు కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని హితవు
  • ఢిల్లీకి రాష్ట్ర హోదాను అంబేద్కర్, నెహ్రూ వ్యతిరేకించారన్న అమిత్ షా
  • కూటమిలో ఉన్నారనే కారణంతో ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతు పలకవద్దని సూచన
ఓట్లు, అధికారం కోసం పొత్తులు పెట్టుకోవద్దని, ప్రజలకు మంచి చేయడానికి పెట్టుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. విపక్షాలు ఎన్ని కూటములు కట్టినా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీయే విజయం సాధిస్తుందన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఢిల్లీ పాలనాధికారాల నియంత్రణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని హితవు పలికారు. దేశ భవిష్యత్తు కోసం చేసే చట్టాలను వ్యతిరేకిస్తారా? అని విపక్షాలను నిలదీశారు. ఢిల్లీకి రాష్ట్ర హోదాను, నెహ్రూ, అంబేద్కర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఈ ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. చట్టం చేసే అధికారం కూడా పార్లమెంటుకు ఉందన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగబద్ధమే అన్నారు.

మీ కూటమిలో ఉన్నారనే ఒకే ఒక కారణంతో ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతు పలకవద్దని అన్ని పార్టీలను కోరుతున్నానని అమిత్ షా అన్నారు. ఈ కూటమి ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో మోదీ పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారి ప్రధాన ఉద్దేశ్యం ఘర్షణ పడటమే అన్నారు. ఇక్కడ బదిలీల అంశం సమస్య కాదని చెప్పారు. వారి బంగ్లాల నిర్మాణం వంటి వాటిల్లో జరుగుతోన్న అవినీతిని దాచేందుకు విజిలెన్స్ విభాగాన్ని నియంత్రించడమే అసలు సమస్య అన్నారు. 2015కు ముందు వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగాయన్నారు.
Amit Shah
BJP
New Delhi
Congress

More Telugu News