Vaishnavi Chaitanya: రామ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన 'బేబి' హీరోయిన్?

  • 'బేబి' సినిమాతో హిట్ అందుకున్న వైష్ణవి
  • యూత్ లో పెరిగిపోయిన ఫాలోయింగ్ 
  • క్యూ కడుతున్న ఆఫర్లు
  • పూరి సినిమాలో ఛాన్స్ దొరికిందనే టాక్
Vaishnavi Chaitanya in Ram movie

ఇప్పుడు యూత్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైష్ణవి చైతన్య. 'బేబి' సినిమా హిట్ తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ, కథ ఆమె పాత్ర ప్రధానంగానే నడుస్తుంది. ఈ సినిమాకి ఆమె గ్లామర్ .. నటన ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. 

ఈ నేపథ్యంలో ఆమెను తమ సినిమాలోకి తీసుకోవడానికి యంగ్ హీరోలంతా గట్టిగానే ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. యంగ్ హీరోలతో ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్న మేకర్స్, ముందుగా ఆమె పేరునే పరిశీలిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే ఆమె పూరి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. రామ్ హీరోగా పూరి 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉందట. ఒక హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేయడం జరిగిందని చెబుతున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

More Telugu News