Telangana: మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly sessions for three days
  • బీఏసీకి మజ్లిస్ నుండి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరు
  • కాంగ్రెస్ నుండి మల్లు భట్టి విక్రమార్క
  • సమావేశాలు 20 రోజులు నిర్వహించాలని కోరిన మల్లు 
అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధికార పార్టీ నుండి డిప్యూటీ స్పీకర్ పద్మారావు, పలువురు మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుండి మల్లు భట్టి విక్రమార్క, మజ్లిస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. 

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. మూడ్రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకున్న చర్యలపై చర్చిస్తామని వెల్లడించింది. అయితే, ఈ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది.
Telangana
AP Assembly Session
BRS

More Telugu News