Rajkummar Rao: నెట్ ఫ్లిక్స్ ట్రాక్ పైకి మరో వెబ్ సిరీస్ .. 'గన్స్ అండ్ గులాబ్స్'

  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే 'గన్స్ అండ్ గులాబ్స్' 
  • స్టైలీష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ 
  • ఇతర పాత్రల్లో రాజ్ కుమార్ రావు .. ఆదర్శ్ గౌరవ్ .. గుల్షన్ దేవయ్య 
  • ఈ నెల 18వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
Guns And Gulaabs Streaming date confirmed

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు విశేషమైన ఆదరణ పెరిగిపోయింది. బాలీవుడ్ .. హాలీవుడ్ సినిమాలను తలపించే క్వాలిటీతో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, తన కెరియర్లో చేసిన ఫస్టు వెబ్ సిరీస్ గా 'గన్స్ అండ్ గులాబ్స్' రూపొందింది. 

దుల్కర్ తో పాటు ఈ వెబ్ సిరీస్ లో రాజ్ కుమార్ రావు .. ఆదర్శ్ గౌరవ్ .. గుల్షన్ దేవయ్య ప్రధానమైన పాత్రలను పోషించారు. గతంలో 'ది ఫ్యామిలీ మేన్' .. 'ఫర్జీ' వంటి వెబ్ సిరీస్ లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. ఆగస్టు 18వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. 

 ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే వెబ్ సిరీస్.  గ్యాంగ్ స్టర్స్ కీ .. పోలీసులకి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. స్టైలీష్ గ్యాంగ్ స్టర్ గా ఈ వెబ్ సిరీస్ లో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. 1990లలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందినట్టుగా చెబుతున్నారు. 

More Telugu News