Plane Crash: కూలిన విమానం, భారతీయ ట్రెయినీ పైలట్ మృతి

Indian student and pilot found dead after Philippines plane crash
  • ఫిలిప్పీన్స్‌లోని అపాయోవా ప్రావిన్స్‌లో కూలిన విమానం
  • ఘటనా స్థలాన్ని గుర్తించిన సిబ్బంది
  • మృతుల కోసం తీవ్రంగా గాలింపు 
  • మంగళవారం లావోంగ్ నగరం నుంచి బయలుదేరిన విమానం
  • అ తరువాత కాసేపటికే విమానం అదృశ్యం
  • ఘటనలో మరణించిన భారతీయ ట్రెయినీ పైలట్‌ రాజ్‌కుమార్ కోండే
ఫిలిప్పీన్స్‌లో విమానం కూలిన ఘటనలో శిక్షణలో ఉన్న భారతీయ పైలట్ మృతిచెందారు. మంగళవారం ఉదయం అపాయోవా ప్రావిన్స్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. మరుసటి రోజు విమానం కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. విమానం నడుపుతున్న ఫిలిపీన్స్ పైలట్ ఎడ్జెల్ జాన్‌తో పాటూ శిక్షణ తీసుకుంటున్న భారతీయ పైలట్ రాజ్‌కుమార్ కోండే కూడా దుర్మరణం చెందారు. 

విమానం అదృశ్యమైన విషయం వెలుగులోకి రాగానే అత్యవసర సిబ్బంది, ఎయిర్ ఫోర్స్, పోలీసులు రంగంలోకి దిగారు. విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు. అయితే, విమానంలోని ఇద్దరి మృతదేహాల కోసం ఇంకా గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లావోంగ్ నగరం నుంచి విమానం బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆ తరువాత కొన్ని గంటలకే విమానం కనిపించకుండా పోయింది. ఫిలిప్పీన్స్‌ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మృతుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Plane Crash
Philippines

More Telugu News