Raw Vegan diet: నాలుగేళ్ల పాటు పళ్లు, మొలకెత్తిన గింజలు మాత్రమే తిన్న మహిళ మృతి

  • రా వీగన్ డైట్ ఫాలో అవుతున్న రష్యా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జానా డీఆర్ట్
  • ఆసియా పర్యటనలో అనారోగ్యం పాలై జులై 21న మృతి  
  • కలరా లాంటి వ్యాధి సోకి జానా మరణించిందని ఆమె తల్లి వెల్లడి
  • వండని ఆహారం శరీరానికి హానికరమంటున్న వైద్యులు
Influencer who ate raw vegan food for 4 years dead

రష్యాకు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వరుసగా నాలుగేళ్ల పాటు పచ్చి శాకాహారం మాత్రమే తిని మృతి చెందిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పచ్చి శాకాహారాన్ని నిత్యం ప్రోత్సహించే జానా డీ ఆర్ట్ ఇటీవల సౌత్‌ఈస్ట్ ఏషియా పర్యటిస్తూ అనారోగ్యం పాలయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ జులై 21న దుర్మరణం చెందారు. కలరా లాంటి వ్యాధి బారని పడి జానా మృతి చెందిందని ఆమె తల్లి మీడియాకు తెలిపారు. 

కాగా, జానా గత నాలుగేళ్లగా పచ్చి శాకాహారంపైనే ఆధార పడింది. పళ్లు, మొలకెత్తిన సన్‌ఫ్లవర్ గింజలు, పళ్ల రసాలే ఆహారంగా తీసుకునేది. ఫలితంగా చివరి రోజుల్లో ఆమె శరీరం ఎముకల పోగులా మారింది. చివరకు ఆరోగ్యం క్షీణించి మరణించింది. 

అయితే, వండని ఆహారం శరీరానికి మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది. పళ్లు, మొలకెత్తిన గింజలు పచ్చిగా తిన్నప్పటికీ ఇలాంటి వండని శాకాహారం శరీరానికి హానికరమని వైద్యులు కూడా చెబుతారు. వండిన ఆహారాన్ని తింటే పేగుల్లో రక్త ప్రసరణ మెరుగై ఆహారం త్వరగా జీర్ణమవుతుందట. అంతేకాకుండా, వండిన ఆహారం కడుపులో త్వరగా జీర్ణమవుతుంది. 

జానా మరణానికి కారణమైన రా వీగన్ డైట్‌ను ఫాల్లో అయేవాళ్లు పచ్చి కూరగాయలు, పళ్లు, విత్తనాలు, మొలకెత్తిన గింజలు, దుంపలు మాత్రమే తింటారట. ఇక వండుకోవాల్సి వస్తే చాలా పరిమతమైన వేడిలోనే ఆహారాన్ని వేడి చేసుకుని తింటారట. ఈ డైట్‌తో ఆరోగ్యానికి గొప్ప మేలు జరుగుతుందన్న భావన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News