Revanth Reddy: కాంగ్రెస్ హెచ్చరిక వల్లే కేసీఆర్ రుణమాఫీ ప్రకటన: రేవంత్ రెడ్డి

Revanth Reddy on loan waiver
  • రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్ పార్టీ విజయమన్న రేవంత్
  • ఉద్యమాలు, పోరాటాల ఒత్తిడితో ప్రకటించారన్న టీపీసీసీ చీఫ్
  • రుణమాఫీ అమలు చేయకుంటే బ్యాంకుల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించామని వెల్లడి
రేపటి నుండి రుణమాఫీని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు. ఉద్యమాలు, పోరాటాల ఒత్తిడితోనే కేసీఆర్ రుణమాఫీని ప్రకటించారన్నారు. కాంగ్రెస్ నేతలు సీఎస్‌ను కలిసి రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. రుణమాఫీని అమలు చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ హెచ్చరించిందని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రకటన చేశారన్నారు. కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ నాలుగేళ్లు ఆలస్యమైందన్నారు.
Revanth Reddy
Congress
KCR
loan waiver

More Telugu News