Chiranjeevi: సెన్సార్ పూర్తి చేసుకున్న 'భోళాశంకర్'

  • మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా 'భోళాశంకర్'
  • ముఖ్యమైన పాత్రలలో తమన్నా - కీర్తి సురేశ్ 
  • సంగీతాన్ని అందించిన మహతి స్వరసాగర్ 
  • ఆగస్టు 11వ తేదీన భారీస్థాయిలో విడుదల 
Bhola Shankar movie update

చిరంజీవి కథానాయకుడిగా 'భోళాశంకర్' సినిమా రూపొందింది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. గతంలో తమిళంలో అజిత్ హీరోగా చేసిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్. ఆ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్. ఆ కథకు మెగాస్టార్ మార్కును జోడించి తెలుగులో రీమేక్ చేశారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా అలరించనుండగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. అలాగే మాస్ యాక్షన్ కి సంబంధించిన అంశాలు పుష్కలంగా ఉంటాయి. మహతి స్వరసాగర్ అందించిన బాణీలకు ఇప్పటికే మంచి మార్కులు పడిపోయాయి. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. భారీతారాగణం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ కానుంది. ఆ జాబితాలో తరుణ్ అరోరా .. బ్రహ్మానందం .. మురళీ శర్మ .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. 

More Telugu News