Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ లో భారీగా చేరికల వెనుక కారణం ఇదే: భట్టి

Bhatti opines on joinings in Congress party
  • బీఆర్ఎస్ నుంచి చాలామంది బయటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న భట్టి
  • షర్మిల కాంగ్రెస్ లో చేరిక అంశం తన దృష్టిలో లేదని వెల్లడి
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమయ్యామని స్పష్టీకరణ
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చాలామంది నేతలు అనుకుంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ లో భారీగా చేరికల వెనుక ఉన్న కారణం ఇదేనని స్పష్టం చేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేరిక అంశం తన దృష్టిలో లేదని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తమ పార్టీ హైకమాండ్ ను కలుస్తున్నానని భట్టి వెల్లడించారు. 

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, పూర్తిగా సన్నద్ధమయ్యాయని తెలిపారు. అనేక అంశాలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల మేర అప్పులపాలైందని విమర్శించారు.  

తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు వంటి ఆకాంక్షలు నెరవేరలేదని తెలిపారు. ఇటీవల తన పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలను దగ్గర్నుంచి చూసి తెలుసుకున్నానని చెప్పారు.
Mallu Bhatti Vikramarka
Joinings
Congress
BRS
YS Sharmila
Telangana

More Telugu News