Zomato: డ్రోన్ తో జొమాటో ఆర్డర్ల డెలివరీ.. ఓ ఏజెంట్ స్వయంకృషి

  • రోజులో ఎక్కువ సమయం ఆర్డర్ల డెలివరీ కోసం ఖర్చు
  • ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో కాలహరణం
  • దీనికి పరిష్కారంగా డ్రోన్ ను ఆవిష్కరించిన డెలివరీ ఏజెంట్
Zomato delivery agent builds drone to deliver food Watch

ఆకలి మార్గం చూపిస్తుందంటారు. అలాగే, పనిలో కష్టం ఓ డెలివరీ ఏజెంట్ తో వినూత్న ఆవిష్కరణ దిశగా ప్రోత్సహించిందని చెప్పుకోవాలి. రోజంతా ఆర్డర్లు డెలివరీ చేసేందుకు శక్తి చాలకపోవడంతో, డెలివరీ బోయ్ ఒకరు ఏకంగా డ్రోన్ ను తయారు చేశాడు. అతడి పేరు సోహన్ రాయ్. తాను ఎందుకు డ్రోన్ ను తయారు చేసిందో వివరిస్తూ ఓ వీడియో చేసి మరీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 

జొమాటో డెలివరీ ఏజెంట్ గా రాయ్ రోజంతా పనిచేయాల్సి వచ్చేది. రోజులో అధిక సమయం ఈ పని చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవడం అతడికి మరింత సమస్యగా అనిపించేది. ఎన్నో గంటల సమయం ఇలా ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం వల్ల కోల్పోవాల్సి వచ్చేది. ఈ బాధలకు పరిష్కారంగా అతడు డ్రోన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రోన్ తయారు చేయడం, డెలివరీకి ముందు టెస్ట్ చేయడం, ఆ తర్వాత అదే డ్రోన్ తో పిజ్జాని డెలివరీ కోసం పంపించడాన్ని వీడియోలో చూడొచ్చు. (వీడియో కోసం)

డ్రోన్ డెలివరీ గురించి ఎప్పటి నుంచో వింటున్నా కానీ, దేశంలో ఇప్పటికీ అందుబాటులోకి రాలేదన్న విషయాన్ని అతడు గుర్తు చేశాడు. డ్రోన్ పట్ల ఎంతో ఉత్సాహం ఉండడంతో స్వయం చోదక (అటానమస్) డ్రోన్ ను తన నైపుణ్యాలతో తయారు చేసినట్టు చెప్పాడు. దీన్ని ప్రయోగాత్మకంగానే పరీక్షించి చూశానని, వాణిజ్య ఉత్పత్తి దశకు వచ్చే సరికి మరింత మెరుగ్గా తయారవుతుందన్నాడు.

More Telugu News