హైదరాబాద్కు మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్
- కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకున్న రైలు
- హైదరాబాద్ - బెంగళూరు మధ్య సర్వీసు
- ఈ నెల 6న లేదా 15న ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణానికి ప్రస్తుతం సుమారు 11 గంటలు పడుతోంది. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలకు తగ్గనుంది. ఈ రైలు కాచిగూడలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగి మధ్యహ్నం 3 గంటలకు యశ్వంత్ పూర్ స్టేషన్ లో బయలుదేరి రాత్రి 11:30 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.