Tractor accident: పైనుంచి ట్రాక్టర్ వెళ్లినా బతికి బయటపడ్డాడు.. వీడియో ఇదిగో

Tractor Hits Man in Fuel Station in Khammam Shocking Visuals Recorded in CC Camera
  • ఖమ్మంలోని ఓ పెట్రోల్ బంక్ లో ఘటన
  • డీజిల్ నింపేందుకు కిందికి దిగిన డ్రైవర్
  • ఇంజన్ ఆఫ్ చేసే ప్రయత్నంలో గేర్ పడి కదిలిన ట్రాక్టర్
  • టైరు కింద పడ్డా గాయాలతో బయటపడ్డ డ్రైవర్
ట్రాక్టర్ లో డీజిల్ కొట్టించేందుకు వెళ్లిన ఓ డ్రైవర్ మృత్యుంజయుడిగా నిలిచాడు.. డీజిల్ నింపేందుకు కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ గేర్ పడి ట్రాక్టర్ ముందుకు కదిలింది. ట్రాక్టర్ ను ఆపే ప్రయత్నంలో సదరు డ్రైవర్ కిందపడ్డాడు. పై నుంచి ట్రాక్టర్ వెళ్లినా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మొత్తం ఆ బంక్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియో లింక్..

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కృష్ణా రెడ్డి తన ట్రాక్టర్ లో డీజిల్ కొట్టించేందుకు ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం హెచ్ పీ పెట్రోల్ బంక్ కు వచ్చాడు. ట్రాక్టర్‌ పై నుంచి దిగి డ్రైవర్ సీటు దగ్గర ఏదో వెతుకుతుండగా గేర్ పడింది. దీంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. ట్రాక్టర్ ను ఆపేందుకు కృష్ణారెడ్డి కూడా దాంతో పాటే ముందుకు నడుస్తూ ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. దీంతో ఆయన మీది నుంచి ట్రాక్టర్ వెళ్లింది.

ఈ లోపు బంకు సిబ్బంది బ్రేక్ వేసి ట్రాక్టర్ ను ఆపి, ఇంజన్ ఆపేశారు. ట్రాక్టర్ కింద పడ్డ కృష్ణారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో 108 అంబులెన్స్ ద్వారా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tractor accident
khammam
petrol pump
Viral Videos

More Telugu News