Tapsee: హీరోలను కాకుండా హీరోయిన్లనే బాధ్యులను చేస్తున్నారు: తాప్సీ

Why only heroines are responsible for flops asks Tapsee
  • టాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయంలో వరుసగా ఫ్లాప్స్ వచ్చాయన్న తాప్సీ
  • ఆ సమయంలో తనపై వచ్చిన విమర్శలు బాధించాయని ఆవేదన
  • హీరోయిన్లు కొన్ని సన్నివేశాలు, పాటలకే పరిమితమవుతారని వ్యాఖ్య
ఇటీవలి కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ సినీ నటి తాప్సీ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయంలో తనకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయని... ఆ సమయంలో తనపై చాలా విమర్శలు వచ్చాయని చెప్పింది. తనను ఐరన్ లెగ్ అన్నారని మండిపడింది. సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్ పై నిందలు ఎందుకు వేస్తారని ప్రశ్నించింది.

 సాధారణంగా హీరోయిన్లు కొన్ని సన్నివేశాలు, పాటలకే పరిమితమవుతారని... అలాంటప్పుడు సినిమా ఫెయిల్ అవడానికి వారెలా కారణమవుతారని అడిగింది. హీరోలను నిందించకుండా హీరోయిన్లను నిందిస్తారని చెప్పింది. కెరీర్ ప్రారంభంలో ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలో తనకు తెలిసేది కాదని... అందువల్ల తన సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయని తెలిపింది. ఆ సమయంలో తనపై వచ్చిన విమర్శలు తనను బాధించాయని... ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని చెప్పింది.
Tapsee
Tollywood
Bollywood

More Telugu News