Balakrishna: 'భగవంత్ కేసరి' కోసం మాస్ మసాలా సాంగ్!

  • 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ 
  • కథానాయికగా అలరించనున్న కాజల్ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న తమన్ మ్యూజిక్ 
  • పాట కోసం వేసిన ఖరీదైన సెట్ 
  • అక్టోబర్ 19వ తేదీన విడుదల  
Bhagavanth Kesari Movie Update

బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి' సినిమాను రూపొందిస్తున్నాడు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో, బాలయ్య సరసన నాయికగా కాజల్ అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. బాలయ్య మార్కు యాక్షన్ తోనే ఈ కథ నడవనుంది.

ఈ సినిమా కోసం బాలయ్య - కాజల్ కాంబినేషన్ లో ఒక మాస్ మసాలా సాంగును చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. జోరుగా హుషారుగా సాగే ఈ మసాలా సాంగ్ కోసం తమన్ చేసిన ట్యూన్ మాస్ ఆడియన్స్ ను ఊపేస్తుందని అంటున్నారు. ఈ బీట్ లో 'దంచవే మేనత్త కూతురా ..'బిట్ ను కూడా యాడ్ చేయనున్నారని అంటున్నారు. 

ఈ పాట కోసం ఆల్రెడీ హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రత్యేకమైన సెట్ ను వేసినట్టుగా తెలుస్తోంది. ఈ కలర్ ఫుల్ సెట్ లోనే పాట మొత్తం చిత్రీకరిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

More Telugu News