Raviteja: 'టైగర్ నాగేశ్వరరావు' రిలీజ్ డేట్ గురించి తేల్చి చెప్పిన టీమ్!

  • 'టైగర్ నాగేశ్వరరావు'గా కనిపించనున్న రవితేజ
  • కథానాయికగా టాలీవుడ్ కి నుపుర్ సనన్ పరిచయం
  • ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్న రేణు దేశాయ్ 
  • అక్టోబర్ 20న ఐదు భాషల్లో విడుదల  
Tiger Nageshwara Rao release date clarity

రవితేజ కథానాయకుడిగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. 70వ దశకంలో స్టూవర్టుపురం గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' గురించిన కథ ఇది. ఆయనలోని మంచితనం అనే మరో కోణాన్ని కూడా ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు.   

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం లేదంటూ ఒకటి రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ స్పందిస్తూ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. 

ముందుగా చెప్పిన ప్రకారమే తమ సినిమాను అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నామనీ, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఈ సినిమా టీమ్ చెప్పింది. ఈ సినిమాతో కథానాయికగా 'నుపుర్' సనన్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, ఒక ప్రత్యేకమైన పాత్రలో రేణు దేశాయ్ కనిపించనుంది.

More Telugu News