Mallu Bhatti Vikramarka: ఆర్టీసీ విలీనంపై గతంలో కేసీఆర్ ఏమన్నారో అందరికీ తెలుసు: మల్లు భట్టివిక్రమార్క

  • అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామని కాంగ్రెస్ మొదట ప్రకటించిందన్న భట్టి
  • మా ప్రకటనతో కేసీఆర్ దిగి వచ్చారన్న మల్లు భట్టి
  • మేం డిమాండ్ చేస్తే 'పనికి మాలిన పార్టీలు పనిలేని మాటలు' అన్నారని ఆవేదన
Mallubhatti Vikramarka on RTC merger in Government

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ పార్టీ విజయమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తమ పార్టీ ప్రకటించిందని, దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దిగి వచ్చారన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తాము గతంలోనే డిమాండ్ చేశామని, అప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసునన్నారు. పనికి మాలిన పార్టీలు పని లేని మాటలు మాట్లాడుతున్నాయని అప్పుడు కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఆర్టీసీ అస్తులు అన్నీ ప్రజల ఆస్తులేనని, వాటిని కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.

More Telugu News