Delhi Ordinance bill: ఢిల్లీ అధికారాల ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా.. విపక్షాల ఆందోళన

Amit Shah introduced Delhi Ordinance bill in Lok Sabha
  • బిల్లు చట్టరూపం దాలిస్తే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర
  • అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్రానిదే పెత్తనం
  • బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసే ఢిల్లీ అధికారాల ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే ఢిల్లీలోని అధికారులపై పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అధికారుల నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు.

 ఈ బిల్లును ఆప్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కేజ్రీవాల్ కు అండగా నిలిచాయి. బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల వరకు సభను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. 

  • Loading...

More Telugu News