Bro: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్!

Sai DharamTej visits Kanaka Durgamma Temple seeks blessings
  • గత శుక్రవారం విడుదలైన ‘బ్రో’ సినిమా
  • విజయోత్సవాలను నిర్వహిస్తున్న చిత్ర బృందం
  • కనకదుర్గ అమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సాయి తేజ్
మామా అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో’ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ‘బ్రో’ విజయోత్సవాలను చిత్ర బృందం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి తేజ్ దర్శించుకున్నాడు. 

ఈ సందర్భంగా సాయి తేజ్ సహా చిత్ర బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటం, లడ్డూలను అందించారు. 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారి‘బ్రో’ సినిమాలో నటించారు. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే, తమన్ సంగీతం అందించారు. విడుదలైన అన్ని సెంటర్లలో బ్రో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Bro
Kanakadurga temple
Sai dharam tej
Pawan Kalyan
Trivikram Srinivas
P.samuthirakani
Bro Vijaya Yatra

More Telugu News